ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిడెడ్‌విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదు: సీఎం జగన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 25, 2021, 04:20 PM

ఉన్నత విద్యపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం చేపట్టారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్షలో చర్చించిన అంశాలు..


ఎయిడెడ్‌విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదు


►ఎయిడెడ్‌విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదు. ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తి స్వచ్ఛందం.


►శిథిలావస్థలో, మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు, సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు.


►ఇలాంటి వారికి ఒక అవకాశ ప్రభుత్వం పరంగా కల్పించాం. ప్రభుత్వానికి అప్పగిస్తే.. ఆయా సంస్థలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది.


►లేదు తామే నడుపుకుంటామే భేషుగ్గా నడుపుకోవచ్చుదీనికి ఎలాంటి అభ్యంతరంలేదు.


►ప్రభుత్వానికి ఎయిడెడ్‌విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని అందరికీ స్పష్టంచేయాలి:






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com