టెక్ మహీంద్రా కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్ డీసీ) ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలోని ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా టెక్ మహీంద్రా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. డిగ్రీ పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.
భర్తీ చేసే పోస్టులు- కస్టమర్ సర్వీస్ అసోసియేట్
మొత్తం ఖాళీలు- 100
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2021 సెప్టెంబర్ 16
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 18
ఇంటర్వ్యూ తేదీ- త్వరలో వెల్లడించనున్న టెక్ మహీంద్రా
విద్యార్హతలు- డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 2015, 2016, 2017, 2018, 2019, 2020 సంవత్సరాల్లో ఈ కోర్సులు పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి.
వయస్సు- 18 నుంచి 25 ఏళ్లు
తెలియాల్సిన భాషలు- ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ (తప్పనిసరి), కన్నడ (తప్పనిసరి)
ఎంపిక విధానం- టెలిఫోన్ ఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్- హైదరాబాద్
ట్రైనింగ్ పీరియడ్- 20 రోజులు
వేతనం- ఏడాదికి రూ.1,64,000
దరఖాస్తు చేయండిలా..
Step 1- అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారిక వెబ్ సైట్ https://apssdc.in/industryplacements/ లో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 2- ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత హోమ్ పేజీలో ICSTP - Tech Mahindra - 6th Batch సెక్షన్ లో More details పైన క్లిక్ చేయాలి.
Step 3- ఆ తర్వాత Apply పైన క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
Step 4- జిల్లా పేరు, ఆదార్ నెంబర్, అభ్యర్థి పేరు, ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, క్వాలిఫికేషన్ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
విజయవంతంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అభ్యర్థులకు టెక్ మహీంద్రా దరఖాస్తుల్ని పరిశీలిస్తుంది. అభ్యర్థులకు హెచ్ఆర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందన్న విషయాన్ని హెచ్ఆర్ వివరిస్తారు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ నోటీసులను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్-APSSDC. అభ్యర్థులు ఏపీఎస్ఎస్డీసీ అధికారిక వెబ్సైట్ https://apssdc.in/ ఫాలో కావాలి.