దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, లెజెండ్ బ్యాట్స్ మన్ హషీమ్ ఆమ్లా బ్యాటింగ్ నైపుణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ గోడలా ప్రత్యర్థి బౌలింగ్ దాడులను కాచుకుంటూ, క్రీజులో పాతుకుపోయే ఆమ్లా తన కెరీర్ లో ఎన్నో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా.. తనలో సత్తా తగ్గలేదని మరోసారి నిరూపించాడు. డిఫెన్స్‌ను తలదన్నేలా, ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ హాషీమ్ ఆమ్లా. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక కౌంటీ క్రికెట్లో సర్రే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సౌథాంప్టన్ వేదికగా హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 278 బంతులను ఎదుర్కొన ఆమ్లా.. 37 పరుగులతో అజేయంగా నిలిచి డిఫెన్స్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యర్థి జట్టుకు రుచి చూపించాడు. ఈ క్రమంలో బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టి, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌ను గుర్తుకు తెచ్చాడు. ఆమ్లా డిఫెన్సివ్ ఇన్నింగ్స్‌తో సర్రే జట్టు ఓటమి నుంచి బయటపడింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 488 పరుగులు చేసింది. కివీస్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 213 బంతుల్లో 174 పరుగులు చేశాడు.