గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జయ గ్రాండ్ హోటల్ మీద పోలీసులు ఆకస్మికంగా దాడిచేశారు. వ్యభిచారం చేస్తున్నారంటూ ఐదుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. హోటల్ లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించనట్టు తెలుస్తోంది. అయితే, నిందితులు మాత్రం తాము ఏ తప్పూ చేయలేదని తమను అక్రమంగా అరెస్ట్ చేశారని వాపోతున్నట్టు సమాచారం.ఉపాది హామీ కూలీల దగ్గర లంచం తీసుకుంటూ వీడియో రికార్డింగ్‌లో దొరికిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్అ నంతపురం జిల్లాలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌ని ఎట్టకేలకు సస్పెండ్ చేశారు. సదరు ఫీల్డ్ అసిస్టెంట్ ఇటీవల కూలీల నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా బుక్కైన సంగతి తెలిసిందే. దీంతో లంచం తీసుకున్నట్టు నిర్దారించుకున్న ఉన్నతాధికారులు ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు వేశారు.
కాగా, నార్పల మండలం గడ్డంనాగేపల్లి గ్రామంలో ఉపాది హామీ కూలీల దగ్గర డబ్బులు లంచంగా తీసుకుంటుండగా ఒకరు ఈ దృశ్యాల్ని వీడియో రికార్డింగ్ చేశారు. దీంతో ఈ వీడియో అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైరల్ గా అయింది. ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఉదంతంపై విచారణ చేపట్టిన డిఆర్డిఏ పిడి వేణుగోపాల్ రెడ్డి.. సదరు ఫీల్డ్ అసిస్టెంట్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.