ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి మండపంలో ట్విస్ట్ ఇచ్చిన పెళ్లి కొడుకు..!

national |  Suryaa Desk  | Published : Mon, Mar 22, 2021, 01:55 PM

పెళ్లి చేసుకుంటానని ఓ యువతి కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన ఓ యువకుడు తీరా పెళ్లి రోజు షాక్ ఇచ్చాడు. అతడు ఇచ్చిన ట్విస్ట్ కు పెళ్లి కూతురు కుటుంబం నిర్ఘాంత పోయింది. ఉత్తరప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. మీరట్ కు చెందిన ఓ యువకుడు మ్యాట్రిమోనీ వెబ్ సైట్ ద్వారా నకిలీ ప్రొఫైల్ తో ఓ అమ్మాయిని వలలో వేసుకున్నాడు. తానొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని, ఉన్నత కుటుంబానికి చెందిన వాడినని వారందరినీ నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు.


అయితే తనకు కట్నకానుకల కింద రూ.30 లక్షల నగదు, బంగారం కావాలని డిమాండ్ చేశారు. మంచి సంబంధం అని భావించిన యువతి తల్లిదండ్రులు యువకుడి డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎంగేజ్మెంట్ కూడా చేశారు. అనంతరం యువతితో చెట్టాపట్టా లేసుకు తిరిగాడా యువకుడు. పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్ది కట్నం డబ్బు కావాలని ఒత్తిడి తెచ్చాడు. పెళ్లికి ఒక రోజు ముందు ఇచ్చుకుంటామని యువతి పేరెంట్స్ చెప్పారు.


అనుకున్నట్లుగానే పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం పెళ్లికి ఒక రోజు ముందుగానే అమ్మాయి తల్లిదండ్రులు మొత్తం రూ.30 లక్షల నగదును పెళ్లి కొడుకుకు అప్పగించారు. అంతా సజావుగా సాగుతోంది అనుకునే లోపే పెళ్లి మండపంలో అలజడి రేగింది. తెల్లవారితే పెళ్లి అనే సమయంలో పొద్దునే ఆ పెళ్లి కొడుకు మొత్తం డబ్బులను సూట్ కేసులో పెట్టుకొని, మారువేషంలో పెళ్లి మండపం నుంచి ఉడాయించాడు. కట్నం డబ్బుతో పెళ్లి కొడుకు ఉడాయించడంతో మండపంలో ఉన్నవారంతా షాక్ కు గురయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com