ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీ, అడ్రస్ మార్చుకోండిలా..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 28, 2020, 02:19 PM

రేషన్ కార్డు, ఓటర్ కార్డు మాదిరిగా ఆధార్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఇంకా ఆధార్ కార్డును ఐడెంటిటీ కార్డుగా ఉపయోగించొచ్చు. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐటిఆర్ దాఖలుకు కూడా ఆధార్ ఉండాల్సిందే. ఇలా ఆధార్ కార్డు చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. అందుకే ఆధార్ కార్డులో వివరాలు కరెక్ట్‌గా ఉండేలా. కానీ చాలా మంది ఆధార్ కార్డుల్లో వివరాలు కరెక్ట్‌గా ఉండకపోవచ్చు. పుట్టిన తేదీ, పేరు, జెండర్, అడ్రస్ ఇలా పలు వివరాల్లో తప్పులు ఉండొచ్చు. తప్పులు ఉన్నా కూడా ఇబ్బంది లేదు. ఆధార్ కార్డులోని వివరాలు తప్పుగా ఉంటే వాటిని సరిచేసుకోవచ్చు. అయితే ఇది అంత సులువు కాదు. ఆధార్ కార్డులో వివరాలు మార్చుకోవాలని భావిస్తే.. కచ్చితంగా పలు డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. పుట్టిన తేదీ, అడ్రస్, పేరు వంటివి మార్చుకోవాలంటే డాక్యుమెంట్లు అందించాలి.
ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో ఆధార్ కార్డు వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్‌లో వివరాలు అప్‌డేట్ చేసుకోవాలంటే ఏ ఏ డాక్యుమెంట్లు అవసరం అవుతాయో యూఐడీఏఐ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. ఈ డాక్యుమెంట్లు అన్నింటిలోనూ మీ పేరే ఉండాలి. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చుకోవడానికి 15 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. అలాగే అడ్రస్ మార్చుకోవడానికి ఏకంగా 45 డాక్యుమెంట్లలో ఏ ఒక్కటి ఇచ్చిన పని అయిపోతుంది. రిలేషన్‌షిప్ మార్చుకోవడానికి 14 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి ఇవ్వొచ్చు. బర్త్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్, పాన్ కార్డు, మార్క్ షీట్ వంటి పలు డాక్యుమెంట్ల ద్వారా ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చుకోవచ్చు. పాస్‌పోర్ట్, బ్యాంక్ స్టేట్‌మెంట్, పాస్‌బుక్, రేషన్ కార్డు, పోస్టాఫీస్ అకౌంట్ స్టేట్‌మెంట్, ఓటర్ ఐడీ, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు వంటి పలు డాక్యుమెంట్ల ద్వారా ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com