ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెల్లంతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 01, 2020, 06:13 PM

పండుగ వచ్చిందంటే.. గుమగుమలాడే పిండి వంటలు నోరూరిస్తాయి. బూరెలు, పరవాన్నం తదితరాలు తయారు చేయడానికి ఎక్కువగా బెల్లాన్నే వాడతారు. బెల్లం మంచి రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మంచిదనే ఉద్దేశ్యంతో దీన్నే వాడతారు. బెల్లం వలన కలిగే ఆరోగ్య ప్రయోజాలేంటో ఇప్పుడు చూద్దాం...


-> బెల్లంలో ఎక్కువగా ఉండే మెగ్నీషియం వల్ల పేగులకు బలం లభిస్తుంది. బరువు తగ్గాలంటే బెల్లం తినండి.


-> బెల్లంలోని పొటాషియం శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది కండరాలను ధృడంగా ఉంచుతుంది.


-> బెల్లంలో ఇనుము, కాల్షియం అధిక మోతాదులో, ఇతర పోషకాలు స్వల్పంగా ఉంటాయి.


-> రోజూ రాత్రిపూట భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇది శరీరంలో వేడిని తగ్గిస్తోంది.


-> బెల్లంతో లివర్ సమస్యలు దూరమవుతాయి. ఇందులో ఉండే మొలాసిస్‌లో పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ పదార్థాలు శరీరానికి శక్తిని అందిస్తాయి.


-> బెల్లం నీరు ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తుంది. దీనిలో ఉండే ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్‌ను పెంచుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది.


-> ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి బెల్లం మంచిది. మలబద్దకం, గ్యాస్, ఏసీడీటీ సమస్యలు కూడా ఉండవు.


-> బెల్లం శ్వాసకోస సంబంధ సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, సోడియం శరీరంలోని యాసిడ్ లెవెల్స్‌ని క్రమపద్ధతిలో ఉంచుతాయి.


-> బెల్లం నుంచి విడుదలయ్యే ఎండోర్ఫిన్స్ శరీరానికి నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com