ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1564 ఎస్‌ఐ పోస్టులకు ప్రకటన..జూలై 16 ఆఖరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 12, 2020, 07:51 PM

కేంద్ర బలగాల్లో కొలువుల అవకాశం కల్పిస్తూ స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్ (SSC) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం డిగ్రీ అర్హతతో శరీర దారుఢ్యం ఉన్న పురుష, మహిళా అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. మంచి జీతభత్యాలతో కూడిన భద్రమైన ఉద్యోగం. దేశంలోని పారా మిలిటరీ దళాల్లో 1564 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్త వివరాలను ssc.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జులై 16, 2020 దరఖాస్తుకు చివరితేదీ.


మొత్తం ఖాళీలు: 1564


ఢిల్లీ పోలీస్ (ఎస్‌ఐ ఫురుషులు) - 91


ఢిల్లీ పోలీస్‌ (ఎస్‌ఐ మహిళలు) - 78


సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (ఎస్‌ఐ)‌- 1395


అర్హతలు:


ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 2021, జనవరి 1 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు ఎక్స్ ‌సర్వీసమెన్ అభ్యర్థు‌లకు మూడేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.


ఎంపిక విధానం


పేపర్‌-1, పేపర్‌-2, పీఈటీ/పీఎస్‌టీ, వైద్యపరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. పేపర్‌-1 సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 5 వరకు, పేపర్‌-2 మార్చి 1, 2021 తేదీన నిర్వహిస్తారు.


పేపర్‌-1 పరీక్ష విధానం:


ఇందులో నాలుగు పార్ట్‌లు ఉంటాయి. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ ఉంటాయి. ఒక్కో టాపిక్‌ నుంచి 50 చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 200 మార్కులు. పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు.


పేపర్‌-2 పరీక్ష విధానం:


ఈ విభాగంలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ ఒక్కటే ఉంటుంది. దీనిలో 200 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి.


గమనిక:


పేపర్‌-1, 2లలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. తప్పు జవాబు గుర్తిస్తే 1/4 వంతు అంటే 0.25 మార్కులు కోత ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌/హిందీ మాధ్యమంలో ఉంటుంది. ఎన్‌సీసీ అభ్యర్థులకు బోనస్‌ మార్కులు ఉంటాయి.


 


శారీరక ప్రమాణాలు


పురుషులు: 170 సెం.మీ ఎత్తు ఉండాలి. ఛాతీ 80 సెం.మీ, గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ ఉండాలి.


మహిళలు: కనీసం 154 సెం.మీ. ఎత్తు ఉండాలి.


3. పీఈటీ (ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌)


పురుషులు:


16 సెకండ్లలో 100 మీటర్ల దూరం పరుగెత్తాలి.


6.5 నిమిషాల్లో 1.6 కి.మీ దూరం పరుగెత్తాలి.


మూడు చాన్స్‌లలో లాంగ్‌ జంప్‌ 3.56 మీటర్లు, హైజంప్‌-1.2 మీటర్లు దూకాలి.


మూడు చాన్స్‌లలో షాట్‌పుట్‌ (16 ఎల్‌బీఎస్‌)- 4.5 మీటర్లు


మహిళలు:


18 సెకండ్లలో 100 మీటర్ల దూరం పరుగెత్తాలి.


4 నిమిషాల్లో 800 మీటర్ల దూరం పరుగెత్తాలి.


మూడు చాన్స్‌లలో లాంగ్‌జంప్‌ 2.7 మీటర్లు, హైజంప్‌ 0.9 మీటర్లు దూకాలి.


వేతనం: నెలకు రూ.35398


పూర్తి వివరాలకు వెబ్ సైట్: ssc.nic.in/


ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com