ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాక్ డౌన్ తరువాత.. అల ముందుకువెళ్దాం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 05, 2020, 04:31 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన మూడు వారాల లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుంది. అయితే, ఆ తర్వాత పరిస్థితి ఏంటనే అంశంపై ఎవరికీ క్లారిటీ లేదు. లాక్ డౌన్ కొనసాగవచ్చని కొందరు, లాక్ డౌన్ ముగిసే అవకాశం ఉందని మరికొందరు, కొన్ని ఆంక్షలతో లాక్ డౌన్‌ను ఎత్తేస్తారంటూ ఇంకొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే, అందులో ఏది వాస్తవమనేది కేంద్రం చేతిలో ఉంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏం చేయాలనే అంశంపై సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏప్రిల్‌ 14 తర్వాత కేంద్రం ఇచ్చే మార్గ దర్శకాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవడంపై సమాయత్తం కావాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ 19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ప్రతి ఆస్పత్రిలో కూడా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. సంబంధిత లక్షణాలతో ఎవరు వచ్చినా... కోవిడ్‌ 19 పేషెంట్‌గానే భావించి ఆ మేరకు వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుని చికిత్స అందించాలని సూచించారు.


దీనిపై ఇదివరకే జారీచేసిన మార్గదర్శకాలను పాటించేలా చూడాలన్నారు. ఢిల్లీలో జమాత్‌కు వెళ్లినవారు, వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌కు పరీక్షలు వీలైనంత వేగంగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి జిల్లాలో కూడా ఒక టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పుడున్న ల్యాబ్‌ల సామర్థ్యాన్నికూడా పెంచాలని అధికారులకు స్పష్టంచేశారు. ప్రతి ఇంటి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరాయంగా సర్వే జరుగుతుండాలని మరోసారి చెప్పారు.విద్యాసంస్థల పునఃప్రారంభంపై స్పందించిన కేంద్రం.. 


కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ మరికొన్నిరోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగియనుందని, విద్యా సంస్థల పునఃప్రారంభంపై లాక్ డౌన్ ముగిసిన తర్వాత సమీక్ష జరిపి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని అన్నారు. ఏప్రిల్ 14 తర్వాత కూడా పాఠశాలలు, కళాశాలలు మూసివేయాల్సి వచ్చినా, విద్యాసంవత్సరం నష్టపోకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని పొక్రియాల్ వెల్లడించారను. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పెండింగ్ లో ఉన్న పరీక్షల నిర్వహణ, ఇప్పటికే పూర్తయిన పరీక్షల మూల్యాంకనం చేపట్టడంపై ఓ ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు.గుర్తింపు కార్డులు లేని సినీ కార్మికులకు సాయం చేసిన ‘జార్జిరెడ్డి’ చిత్ర బృందం.. 


ఉస్మానియా యూనివర్శిటీలో నాటి విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవితం ఆధారంగా కొన్ని నెలల క్రితం విడుదలైన చిత్రం ‘జార్జిరెడ్డి’. లాక్ డౌన్ నేపథ్యంలో సినీ కార్మికులకు సాయంగా నిలిచే నిమిత్తం ఈ చిత్ర యూనిట్ ముందుకొచ్చింది. సినీ కార్మికులుగా పనిచేస్తున్నప్పటికీ  గుర్తింపు కార్డులు లేని వారికి ఆసరాగా నిలుస్తూ వారి కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. జార్జిరెడ్డి చిత్ర నిర్మాతలు అన్నపురెడ్డి అప్పిరెడ్డి, దామురెడ్డి, దర్శకుడు జీవన్ రెడ్డి తో పాటు ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన సందీప్, ఇతర నటులు తదితరులు సినీ కార్మికులకు పదిరోజులకు సరిపడా నిత్యావసరాలు కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు అందజేశారు. ఈ సందర్భంగా అన్నప్పురెడ్డి అప్పిరెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి పరిస్థితుల్లో తోటి వారికి సాయం చేయాలని, సామాజిక స్పృహతో వ్యవహరించాలని అన్నారు.రెండో దశలో 28 రోజుల లాక్ డౌన్  ప్రకటించాలంటున్న కేంబ్రిడ్జ్ విద్యావేత్తలు


భారత్ లో కరోనా మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుండగా, పొడిగించే ఉద్దేశం లేదని కేంద్రం సంకేతాలు ఇస్తోంది. అయితే కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి చెందిన రాజేశ్ సింగ్, ఆర్. అధికారి అనే విద్యావేత్తలు చేసిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు నివేదించారు. భారత్ లో ఒక లాక్ డౌన్ సరిపోదని, మూడు దశల లాక్ డౌన్ విధించాలని పేర్కొన్నారు. అప్పుడే కరోనా మహమ్మారిని నియంత్రించడం సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. 21 రోజుల లాక్ డౌన్ పూర్తయ్యాక ఐదు రోజుల విరామం ఇచ్చి రెండో దశలో 28 రోజుల లాక్ డౌన్  ప్రకటించాలని సూచించారు.


మొదటి దశ లాక్ డౌన్ వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిస్తుందని, అయితే కరోనా వ్యాప్తిని వాస్తవిక దృక్పథంతో చూడాలని, మళ్లీ వ్యాపించే అవకాశం ఉన్నందున మరోసారి లాక్ డౌన్ ప్రకటిస్తే మరికొంత ఉపయోగం ఉంటుందని వివరించారు. తగ్గిన కేసుల ఆధారంగా వైరస్ పునరుజ్జీవనాన్ని అంచనా వేయలేమని తెలిపారు. రెండో దశ లాక్ డౌన్  పూర్తయ్యాక మరో 5 రోజుల విరామం ఇచ్చి ఈసారి 18 రోజుల లాక్ డౌన్ ప్రకటించాలని సూచించారు.  మూడో విడత అనంతరం పాజిటివ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా నమోదవుతుందని, మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గుతుందని రాజేశ్ సింగ్, అధికారి తమ అధ్యయనంలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com