సమాజానికి ఆదర్శంగా నిలవాల్సింది పోయి... ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత ఆమెను మోసం చేసిన పోలీసు అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే... గుంటూరు జిల్లా నగరంపాలెం సిఐ గా వెంకటరెడ్డి పని చేస్తున్నాడు. ఓ మహిళను వంచించి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో వెంకటరెడ్డి తనను మోసం చేశారంటూ.. సదరు మహిళ అర్బన్ ఎస్పీ కి ఫిర్యాదు చేసింది. ఈ విషయం ఐజీ వరకు వెళ్లింది. దీంతో వెంకటరెడ్డిపై విచారణకు ఐజీ ఆదేశించారు. వెంకటరెడ్డి తప్పు చేసినట్టు విచారణలో తేలింది. దీంతో, ఆయనను సస్పెండ్ చేశారు.