అసెంబ్లీ గేటు ముందు గురువారం జరిగిన గొడవపై ఈరోజు సీఎం జగన్ సభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే చంద్రబాబు మార్షల్స్ తో వాగ్వాదానికి దిగారని, సభ్యులు కానివాళ్లను, కార్యకర్తలను కూడా తనతోపాటు అసెంబ్లీ లోకి తీసుకు రావాలని చూడడం సరికాదన్నారు. సాధారణంగా గేట్ నెంబర్ 2 నుంచి అసెంబ్లీకి వచ్చే చంద్రబాబు.. నిన్న మాత్రం ఎందుకు ఊరేగింపుగా వచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుని ఆయన బాస్టర్డ్ అన్నారని, కావాలంటే ఆ పదం మీరు కూడా వినండి అంటూ అసెంబ్లీలో వీడియో ప్లే చేసి చూపించారు.