ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రేటా'కు గుర్తింపు......అవసరమా: ట్రంప్

national |  Suryaa Desk  | Published : Fri, Dec 13, 2019, 07:47 AM

స్వీడన్‌కు చెందిన గ్రేటా థన్‌బెర్గ్‌కు 2019 సంవత్సరపు విశిష్ట వ్యక్తిగా గుర్తింపు నివ్వడంపై అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ ఆక్షేపణ తెలిపారు. టైమ్స్ మేగజైన్ ఈ ఏటి పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా థన్‌బెర్గ్‌కు పట్టం కట్టింది. తాజా సంచికను ఈ 16 ఏళ్ల అమ్మాయి ముఖచిత్రంతో వెలువరించింది. దీనిపై ట్రంప్ వ్యంగ్మాత్మకంగా వ్యాఖ్యానించారు. ఈ పర్యావరణవేత్త ముందు చల్లబడి, వెళ్లి సినిమా చూడటం మంచిదని చమత్కరించారు. అందరిపైనా విరుచుకుపడే గ్రేటాకు ఈ గుర్తింపు ఇవ్వడం తెలివితక్కుత తనం. గ్రేటా ముందు తన కోపం తగ్గించుకునేందుకు శిక్షణ పొందాల్సి ఉంది. తరువాత స్నేహితుడితో కలిసి ఓ మంచి పాత తరహా సినిమాకు వెళ్లితే మంచిది. గ్రేటా చల్లబడితే చాలా మంచిదని చురకలు పెట్టారు. స్వీడన్‌కు చెందిన గ్రేటా ఐరాసలో పర్యావరణ అంశంపై జరిగిన సదస్సులో ప్రపంచ నేతల నిర్వాకాన్ని దుయ్యబట్టారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న వారికెన్ని గుండెలని విరుచుకుపడ్డారు. మానవాళికి ఆలవాలమైన ఒకే ఒక్క గృహం భూగోళం అని, దీనిని సర్వనాశనం చేయవద్దని ట్రంప్‌తో పాటు పలువురు అగ్రనేతల దుమ్ముదులిపారు. ఈ ముక్కుసూటి మహిళకు పట్టం కడుతూ టైమ్స్ పత్రిక విశేష కథనాన్ని వెలువరించడం ట్రంప్‌లో ఆగ్రహాన్ని రగిల్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com