ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో నవశకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2017, 03:09 AM

అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : ఈ మేరకు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి సమక్షంలో ఒప్పంద పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి, రాజధానిలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి, ప్రభుత్వ విభాగాల్లో సామర్థ్యం పెంపు, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహా నికి అవసరమైన సహకారాన్ని సింగపూర్‌ ప్రభు త్వం అందజేస్తుంది. ఎంవోయూలో భాగంగా ఏపీ ప్రభుత్వం సింగపూర్‌కు 1691 ఎకరాలు అందజే యనుంది. అమరావతిలో 6.84 చదరపు కిలోమీ టర్‌ ప్రాంతాన్ని సింగపూర్‌ కన్సార్టియం అభివృద్ధి చేయనుంది. అమరావతి ప్రాంతాన్ని ఉన్నత ప్రమా ణాలతో అభివృద్ధి చేస్తామని సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ అన్నారు. అమరావతి అభివృద్ధి కోసం చంద్రబాబు విజన్‌ ప్రశంసనీయమని కొనియా డారు. అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం అవు తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఏడీపీతో కలిసి కృష్ణా తీరంలో 6.84 చదరపు కిలోమీటర్ల ప్రాంతం అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.


అమరావతిని సింగపూర్‌లా నిర్మిస్తాం : చంద్రబాబు 


అమరావతి అభివృద్థిలో సింగపూర్‌ భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో సింగపూర్‌ మాదిరిగా నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అమరావతి అభివృద్ధికి సింగపూర్‌ కేవలం 6 నెలల్లోనే బృహత్తర ప్రణాళిక ఇచ్చిందన్నారు. రాజధాని కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 33వేల ఎకరాలు సమీకరించామన్నారు.


చంద్రబాబుతో సింగపూర్‌ మంత్రి భేటీ...


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రితో సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ విజయవాడలో భేటీ అయ్యారు. రాజధాని అమరావతి ప్రాంతంలో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి అవగాహన ఒప్పందం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సింగపూర్‌ ప్రతినిధుల బృందం సోమవారం విజయవాడ చేరుకుంది. ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో పాటు 60 మంది ప్రతినిధులకు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు.


స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి కోసం సోమవారం జాయింట్‌ స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఏపీ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్‌ తరపున ఈశ్వరన్‌ చైర్మన్లుగా ఉన్నారు. సభ్యులుగా ఏపీ తరపున ఆర్థిక, పురపాలక శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మౌలిక వసతుల శాఖ కార్యదర్శి, సింగపూర్‌ తరపున ఈశ్వరన్‌తో పాటు మరో నలుగురు సభ్యుల నియామకం జరిగింది. ఆరు నెలలకోసారి స్టీరింగ్‌ కమిటీ సమావేశం, రెండు నెలలకోసారి అధికారుల కమిటీ సమావేశం జరగనుంది. ఫైనాన్సియల్‌ కన్సల్టెంట్‌గా మెకన్సీ, నగర రూపకర్తగా నార్మన్‌ ఫోస్టర్‌ వ్యవహరిస్తున్నాయి. అయితే ఈ కమిటీ తొలిసారిగా సమావేశమైంది. ఈ సమావేశంలో చైర్మన్లు సీఎం చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ మాట్లాడుతూ అమరావతిలో వీలైనంత త్వరగా కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. స్విస్‌ ఛాలెంజ్‌లో సింగపూర్‌ కన్సార్టియం ఎంపిక కాగానే మంత్రిమండలి సమావేశంలో చర్చించామని, దీనికి తమ ప్రధానమంత్రి పూర్తి మద్దతు ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు. 2018 ఆరంభంలో సింగపూర్‌ ప్రధాని భారత్‌ పర్యటన ఉంటుందని, ఈ సందర్భంగా ఆయన అమరావతిని సందర్శించే అవకాశం ఉంటుందని ఈశ్వరన్‌ తెలిపారు.


ఏపీ రాజధాని నిర్మాణంలో కీలక దశకు శ్రీకారం...


రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో కీలక దశకు శ్రీకారం చుట్టింది. సోమవారం స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం, సింగపూర్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. 1691 ఎకరాల్లో స్టార్టప్‌ ఏరియాను సింగపూర్‌ కన్సార్టియం అభివృద్ధి చేయనుంది. విజయవాడలో ఏర్పాటు చేసే సింగపూర్‌ కన్సార్టియంలో సింగపూర్‌ ప్రభుత్వం 15 కంపెనీలను ఏర్పాటు చేయనుంది. ఒప్పందం జరిగిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్‌ భాగస్వామ్యం అవుతున్నందుకు కృతజ్ఞతలని ఆయన అన్నారు. అమరావతిని సింగపూర్‌ మాదిరిగా నిర్మిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అమరావతిని నిర్మిస్తామని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com