ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనారోగ్యానికి ఆసుపత్రిలో చేరిన లతా మంగేష్కర్‌

national |  Suryaa Desk  | Published : Mon, Nov 11, 2019, 04:57 PM

ప్రఖ్యాత బాలీవుడ్‌ గాయని లతా మంగేష్కర్‌  (90) స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస ఇబ్బందిగా ఉందని చెప్పడంతో (నవంబర్ 11) సోమవారం తెల్లవారుఝామున లతాజీని ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి సీనియర్ వైద్య సలహాదారు డాక్టర్ ఫరోఖ్ ఇ ఉద్వాడియా పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు.  ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థతితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. 


కాగా  లతా మంగేష్కర్‌  సెప్టెంబర్ 28 న 90వ పుట్టిన రోజు జరుపుకున్నారు. మరోవైపు అశుతోష్ గోవారికర్ చిత్రం ‘ పానిపట్’ లో గోపికా బాయిగా  నటించిన తన మేనకోడలు పద్మిని కోహ్లాపురి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను  నిన్న (నవంబరు 10) లతా  ట్వీట్‌ చేశారు.  ఈ సందర్భంగా పద్మినితోపాటు , చిత్ర యూనిట్‌కు ఆమె శుభాకాంక్షలు అందజేసిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com