నిషేధిత గుట్కాలు, ఖైనీలు నియంత్రించేందుకు పోలీస్ శాఖ తనిఖీలు చేపట్టి ఎన్నో చోట్ల స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేస్తున్నారు. అయినా వ్యాపారంలో బాగా సంపాదన కు మరిగి నిందితులు రెచ్చిపోతూ ఉయ్యూరు సర్కిల్ పరిధిలో ఏరియాలో వ్యాపారాన్ని విస్తరింప చేసుకుని కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉయ్యూరు సర్కిల్ కార్యాలయం పరిధిలోని తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ వై .చిట్టిబాబు గుట్కా వాహనం తరలిపోతున్న సమాచారం అందుకుని వాహనాన్ని నియంత్రించి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో ఆరు మూటల సరుకు ఉన్నట్లు గుర్తించారు. 2 మూటల గుట్కా, 2 మూటల రాజా ఖైనీ,2 మూటల బిగ్ మీరాజ్ ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితుడు మురారి శివ నాంచారయ్య పై కేసు నమోదు చేసినట్లు తోట్లవల్లూరు ఎస్సై వై .చిట్టి బాబు తెలిపారు.