ఫేస్ బుక్ ఇబ్బందుల్లో పడింది. సీఈవో జుకర్ బర్గ్ తన ఉద్యోగులతో మాట్లాడిన ఆడియో బయటకు రావడంతో దుమారం రేగుతోంది. అమెరికా అధ్యక్షురాలిగా డెమొక్రాటిక్ అభ్యర్థి ఎలిజబెత్ వారెన్ ఎన్నికైతే ప్రమాదమని, చట్టపరంగా ఇబ్బందులు వస్తాయని జుకర్ బర్గ్ మాట్లాడారు. సంస్థను విచ్చిన్నం చేయాలనే కుట్రను గట్టిగా ఎదుర్కొంటామని సవాల్ చేసిన ఆడియో సంచలనంగా మారింది. ఎంప్లాయిస్ తో అంతర్గత ముఖాముఖి సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారని 'ది వెర్జ్' తెలిపింది. అమెరికా ప్రభుత్వం ఫేస్‌బుక్‌ను విచ్ఛిన్నం చేయడంతోపాటు, వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌తో పోటీపడాలనే తమ లక్ష్యాన్నిదెబ్బతీయాలని భావిస్తోందన్నారు. ఎలిజబెత్ వారెన్ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైతే, ఎదురు దెబ్బలు, చట్టపరమైన సమస్యలు తప్పవని భావిస్తున్నట్టు చెప్పారు. ఫేస్బుక్, అమెజాన్, గూగుల్ లాంటి దిగ్గజ టెక్ కంపెనీలను ఆమె టార్గెట్ చేశారన్నారు. చైనా కంపెనీకి చెందిన టిక్‌టాక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. టిక్‌టాక్‌ను ఎదుర్కొనేందుకు కొత్త వీడియో షేరింగ్ యాప్ లాసోను ప్రయోగాత్మకంగా లాంచ్ చేయనున్నట్టు జుకర్‌బర్గ్ చెప్పుకొచ్చారు.
అటు వారెన్ కూడా వరుస ట్వీట్లతో ఫేస్బుక్లై విమర్శలు గుప్పించారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను సొంతం చేసుకోవడం ద్వారా ఫేస్బుక్ ఎక్కువ మార్కెట్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని, సోషల్ నెట్వర్కింగ్ ట్రాఫిక్‌లో 85శాతం కంటే ఎక్కువ ఫేస్బుక్ యాజమాన్యంలోని సంస్థలకు పోతోందన్నారు. మరోవైపు వెర్జ్ కథనాన్ని జుకర్‌బర్గ్ ఖండించారు. తన ఫేస్బుక్ పేజీలో ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇది పూర్తిగా అంతర్గతమే అయినప్పటికీ, ఆసక్తి వున్నవాళ్లు ఫిల్టర్ చేయని వెర్షన్‌ను చెక్ చేసుకోవచ్చని ఒక లింక్‌ను షేర్ చేశారు.