8 నెలల సుదీర్ఘ విరామం తర్వాత స్పానిష్ బాడ్మింటన్ క్రీడాకారిణి కరోలినా చైనా ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు టైటిల్ ను కైవసం చేసుకోవడంతో ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. కెరీర్ ను దూరం చేసే గాయాలనుంచి బయటపడి ఇప్పుడు టైటిల్ ను సొంతం చేసుకున్నందున ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతిభకు ముగ్దులవుతున్నారు. 56నిముషాల అవిశ్రాంత ఆటలో గెలిచి ఒక్కసారిగా కుప్పకూలి "నేను ఊహించలేదు నేను కోలుకున్న తర్వాత మళ్ళీ గెలుస్తానని " అని కన్నీటి పర్యంతమయ్యారు కరోలినా .