ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తగ్గుముఖం ప‌ట్టిన బంగారం ధ‌ర‌లు

national |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2019, 07:51 PM

అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడం, బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి తగ్గించుకోవడంతో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర 0.04 శాతం తగ్గి రూ.37,670గా ఉంది. గత నెలలో రూ.39,885కు పెరిగి రికార్డ్ స్థాయికి చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.2,200 తగ్గింది. ఎంసీఎక్స్‌లో వెండి ధర రూ.0.04 శాతం తగ్గి రూ.46,626కు పడిపోయింది. వెండి గత నెలలో రికార్డ్ హై రూ.51,489 కు చేరుకున్న తర్వాత ఇప్పటి వరకు రూ.4900 పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 1,503గా ఉంది. వెండి ధర ఔన్సుకు 17.87 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గినప్పటికీ ఈ తగ్గుదల ఇలాగే ఉండకపోవచ్చుననే అనుమానాలు ఉన్నాయి. పసిడి ధరలు పెరగడానికి అంతర్జాతీయంగా నెలకొన్న అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం భయాలు ప్రధాన కారణం. ఇప్పుడు అవి సమసిపోవడానికి తోడు ఫెడ్ రేట్ కట్ వంటి కారణాల వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయి.
ఆయా నగరాల్లో బంగారం ధరలు.... చెన్నై 22 క్యారెట్ల బంగారం 35,830, 24 క్యారెట్ల బంగారం 39,020, ముంబయిలో 22 క్యారెట్ల బంగారం 36,500, 24 క్యారెట్ల బంగారం 37,500, న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 36,600, 24 క్యారెట్ల బంగారం 37,710, కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 36,800, 24 క్యారెట్ల బంగారం 38,050, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 35,150 24 క్యారెట్ల బంగారం 38,340గా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com