‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ‘రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి.. దేశంలోని మిగతా దర్శకులందరినీ టీవీ సీరియల్ డైరెక్టర్లుగా ఫీల్ అయ్యేలా చేసింది’ అంటూ తాజాగా మరో ట్వీట్ చేశారు. వర్మ ఇటీవల జక్కన్నతో కలిసి దిగిన ఓ ఫొటోను పోస్టు చేస్తూ.. ‘నేను అసహ్యంగా ఉన్నాను. నాకంటే రాజమౌళే చాలా అందంగా ఉన్నారు’ అని ట్వీట్ చేశారు. అయితే వర్మ ట్వీట్‌కు స్పందించిన రాజమౌళి.. ‘ అయ్యా నన్ను ఒగ్గేయండయ్యా’ అంటూ సమాధానమిచ్చిన విషయం తెలిసిందే.