ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇస్రో శాస్త్రవేత్తలకు నెటిజన్ల బాసట!

national |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2019, 12:48 PM

ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్‌-2కు ఆఖరి కణాల్లో అవరోధం ఏర్పడటంతో నిరాశ చెందిన ఇస్రో శాస్త్రవేత్తలకు నెటిజన్లు బాసటగా నిలిచారు. చంద్రయాన్ -2 మిషన్ 93 శాతం విజయం సాధించిందని, చివరి 2.1 కిలోమీటర్ల దూరం దాకా వెళ్లి ఆగిపోయిందని ఓ ట్విట్టర్ యూజర్ వ్యాఖ్యానించారు. చంద్రుడిపై ఉపగ్రహాన్ని పంపించేందుకు నాసా పదిసార్లు ప్రయత్నించి విఫలమైందని, కాని మన ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ ను చంద్రుడికి అత్యంత సమీపకక్ష్య దాకా వెళ్లిందని మరో నెటిజన్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్ శాస్త్ర సైన్సులో దేశం గర్వపడేలా ప్రయత్నాలు చేసిందని మరో నెటిజన్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన ఘన విజయం చంద్రయాన్-2 ప్రయోగమని భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించవచ్చని జై హింద్ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మొత్తంమీద చంద్రయాన్-2 బ్రేక్ ఏర్పడినా ఇస్రో శాస్త్రవేత్తలను సోషల్ మీడియాలో నెటిజన్లు అభినందనలతో ప్రశంసించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com