గుడివాడ : గుడివాడ మునిసిపల్ వార్డు కు జరిగిన ఉపఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి నండూరి విజయ్ విజయం సాధించారు. ఆ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తెలుగుదేశం, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. సకాలంలో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలనూ చెదరగొట్టారు. విజయోత్సవ ర్యాలీ మార్గంలో ఎమ్మెల్యే కొడాలి నాని (వైకాపా) కారులో వెళుతుండగా…తెలుగుదేశం కార్యకర్తలు బాణసంచా కాల్చేందుకు చేసిన ప్రయత్నాన్ని వైకాపా కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది.