ప్రతి నియోజకవర్గంలోనూ వందశాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇలాంటి పిటిషన్లను మళ్లీ మళ్లీ ప్రోత్సహించలేమని వెకేషన్ బెంచ్ తేల్చి చెప్పింది. వందశాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని సాంకేతిక నిపుణుల బృందం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.