నేడు (శుక్రవారం) హనుమాన్ జయంతిని పురస్కరించుకొని.. ఎపి సిఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ఖాతాలో చంద్రబాబు ట్వీట్ పెడుతూ.. '' రాష్ట్ర ప్రజలందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అతులిత బలదాముడు శ్రీ ఆంజనేయుడు అందరికి శక్తి, సామర్థ్యాలనివ్వాలని కోరుకుంటున్నాను '' అని పేర్కొన్నారు. హనుమాన్ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.