మా ఓటమికి కారణం అతడే.. సన్‌రైజర్స్ ఓటమిపై రషీద్ ఖాన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అన్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.