హిందూపురం సమీపంలోని రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని యువకుడు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ బాలాజీనాయక్ గురువారం తెలిపారు. విధుల్లో ఉన్న కీమ్యాన్ సమాచారం మేరకు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సుమారు 20 ఏళ్లు పైబడి వయసున్న యువకుడు బూడిదరంగు నైట్ ప్యాంటు, కుడిచేయికి కాశాయం తాడు కట్టినట్లు ఆనవాళ్లున్నాయన్నారు.