అనంతపురం వైస్సార్సీపీ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, నేతలు కలిసి శుక్రవారం విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉరవకొండ వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఓటమి భయంతోనే టీడీపీ హింసా రాజకీయాలు చేస్తోంది అని అన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లో ఇష్టారాజ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం వల్లే ఎన్నికల్లో హింస చెలరేగింది అని అన్నారు.