హిందూపురం పట్టణంలోని చిన్నమార్కెట్ వద్ద చోటు చేసుకున్న ఘర్షణలో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. పట్టణంలోని బోయపేటకు చెందిన శివకుమార్, సాయి, మారుతి సాయంత్రం చిన్నమార్కెట్ వద్ద గొడవపడ్డారు. ఘటనలో మారుతి గాయపడ్డాడు. శివ, సాయిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కాగా, శివ, సాయి చేసిన ఫిర్యాదు మేరకు మారుతి వర్గంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.