2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనునట్లు ఎర్రగొండపాలెం రిటర్నింగ్ అధికారి డాక్టర్ పి శ్రీలేఖ బుధవారం తెలిపారు. 26న పరిశీలిన, 29 సాయంత్రం 3గంటలలోపు ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు. అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే అనుమతులు అన్నారు. సెల్ ఫోన్ అనుమతులు లేవన్నారు. 100 మీటర్ల దూరంలోనే ర్యాలీ నిలిపివేయాలన్నారు.