ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎస్కేకు బిగ్ షాక్

sports |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 10:51 AM

చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు బ్యాటర్ డేవన్ కాన్వే ఐపీఎల్‌ 17 సీజన్ తొలి భాగంలో ఆడటం లేదు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ సందర్భంగా కాన్వే ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. అతడిని పరిశీలించిన వైద్యబృందం శస్త్రచికిత్స అవసరమని.. కనీసం 8 వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. దీంతో రెండు నెలలపాటు క్రికెట్‌కు దూరం ఉంటాడు.
ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందే సీఎస్కేకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, కివీస్ ప్లేయర్ కాన్వే గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరం కానున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో మ్యాచులో కాన్వే ఎడమ చేతి బొటన వేలికి గాయమవగా.. మధ్యలోనే మైదానాన్ని వీడారు. ఇటీవల ఆయనకు సర్జరీ జరగగా.. కనీసం ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఈ సీజన్‌కు ఆయన అందుబాటులో ఉండరని తెలుస్తోంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com