ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 18లోపు చెప్పాలి.. టీటీడీ కీలక సూచన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 07:21 PM

స్విమ్స్ ఆసుపత్రి భవనాల పునరుద్ధరణ పనులను రూ . 197 కోట్లతో చేపట్టడానికి టెండరు డాక్యుమెంట్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించారు. తిరుమలకు విచ్చేయు భక్తుల వైద్య సౌకర్యార్థమై, పరిసర ప్రాంత రోగులకు మైరుగైన సౌకర్యాలను అందించడానికి పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలుంటే ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తెలియజేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి ఏవైనా సలహాలు, అభ్యంతరాలను apjudicialpreview@gmail.com కు లేదా cettdtpt@gmail.com కానీ మెయిల్ ద్వారా తెలియజేయాలని కోరారు. ఇతర వివరాల కోసం https://judicialpreview.ap.gov.in ,www.tirumala.org వెబ్ సైట్ లను సంప్రదించాలని సూచించారు.


చిన్నారులలో నమ్మకం మరియు భద్రతా భావం కలిగించడం ఎలా..!


తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 17వ తేదీన తెల్లవారుజామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ ఉదయం నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2024 జనవరి 14న ముగియనున్నాయి. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.


12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.


శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఫార్మసీ డిప్లొమా కోర్సుకు స్పాట్ అడ్మిషన్లు


ఎన్.బి.ఎ గుర్తింపుగల టీటీడీకి చెందిన శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఫార్మసీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి డిసెంబరు 13వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ లేదా బైపీసీ ఉతీర్ణత పొందిన ఆసక్తి గల విద్యార్థినులు విద్యార్హత సర్టిఫికెట్ల ఒరిజినల్ మరియు 3 సెట్ల జిరాక్స్ కాపీలతో నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది. ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన కోర్సు ఫీజుతో విద్యార్థినులకు ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తారు. సీట్లు పరిమితంగా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం 9299008151, 9247575386, 8978993810 నంబర్లను సంప్రదించగలరు.


డిసెంబ‌రు 10న‌ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో తిరువ‌డి స‌న్నిధి ఉత్స‌వం


తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో కార్తీక మాసంలో చివ‌రి ఆదివార‌మైన డిసెంబ‌రు 10న తిరువ‌డి స‌న్నిధి ఉత్స‌వం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 8 గంట‌ల‌కు ఎదురు ఆంజ‌నేయ‌స్వామివారి మూల‌వ‌ర్ల‌కు తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. మ‌ధ్యాహ్నం 2 నుండి 4 గంట‌ల వ‌ర‌కు ఉభ‌య‌నాంచారుల‌తో క‌లిసి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌ను ఆంజ‌నేయ‌స్వామివారి స‌న్నిధికి వేంచేపు చేసి ఏకాంతంగా తిరుమంజ‌నం చేప‌డ‌తారు. అక్క‌డ ఆస్థానం అనంత‌రం ఉభ‌య‌నాంచారుల‌తో కూడిన‌ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు, శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌ను ఆల‌య మాడ వీధుల్లో ఊరేగింపుగా శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యానికి తీసుకెళ‌తారు. దీంతో తిరువ‌డి స‌న్నిధి ఉత్స‌వం ముగుస్తుంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com