ముంబై : ఎయిర్ ఇండియా మాజీ డైరెక్టర్ ఫర్ ఆపరేషన్స్ కెప్టెన్ అరవింద్ కాత్పాలియాను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇ.డి)గా తక్కువ పదవిలో నియమించారు. విమానం నడపటానికి ముందు ఆల్కహాల్ టెస్టులో రెండుసార్లు కాత్పాలియా విఫలమయ్యారు. దీనితో ఆయనను మూడు నెలలపాటు సస్పెండ్ చేశారు. కాత్పాలియాకు రివర్షన్ ఇచ్చి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించారని, అయితే ఆయన బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రత్యేకమైన విభాగమేమీ కేటాయించలేదని ఎయిర్ ఇండియా వర్గాలు పేర్కొన్నాయి.