రావిషింగ్ బ్యూటీ రాశీఖన్నా నటనతో పాటు తనలోని ఎక్స్ ట్రా స్కిల్స్ ని అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు ఉమెన్స్ డే సందర్భంగా ఓ బ్యూటీఫుల్ పోయెమ్ రాసి తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. ఇక మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు ఓ వీడియోని డెడికేట్ చేయాలని భావిస్తుందట. ప్రస్తుతం రాశీ ఖన్నా పలు సినిమాలతో బిజీగా ఉండగా ఉన్ని కృష్ణన్-మోహన్ లాల్ ప్రాజెక్ట్ తో మలయాళం ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇందులో ఈ సుప్రీమ్ బ్యూటీ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తుందట. ఇక తెలుగులో గోపిచంద్ సరసన ఆక్సీజన్ మూవీలో నటించిన రాశి , రవితేజ టచ్ చేసి చూడు, జూనియర్ ఎన్టీఆర్ 27వ చిత్రాలలో కథానాయికగా నటించనుంది. తమిళంలో సైతాన్ కా బచ్చా చిత్రం ఈ అమ్మడికి డెబ్యూ మూవీ కాగా ప్రస్తుతం ఈ చిత్రంతోను బిజీగా ఉంది రాశీ. ఇమైక్క నోడీగల్ అనే మరో తమిళ చిత్రంలో కూడా రాశీ నటిస్తుంది.