విజయవాడ: భవిష్యత్ తరాలకు గుర్తుండేలా ‘ఎన్టీఆర్’ సినిమా ఉంటుందని సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. విజయవాడలో జరుగుతున్న మహానాడుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ బయోపిక్‌పై మీడియాతో మాట్లాడారు. అందరి అంచనాలకు తగ్గట్టుగా ఎన్టీఆర్ సినిమాను రూపొందిస్తున్నామన్నారు. నేను, క్రిష్ కాంబినేషన్లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తుందన్నారు. సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ సినిమాను విడుదల చేస్తామన్నారు.