ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరి వేసుకుని ఆటో డ్రైవర్ ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 01:10 PM

కోటబొమ్మాళి మండలం, కురుడు గ్రామంలోని కాలనీకి చెందిన ధర్మాన రామారావు (43) అనే ఆటో డ్రైవర్ ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. మృతుడు శనివారం గార మండలం గొర్రెలవానిపేట బంధువుల ఇంటికి వివాహానికి వెళ్లాడు. అక్కడ వారితో గొడవపడి మనస్థాపానికి గురై రాత్రి అక్కడ నుంచి ఇంటికి చేరుకుని తెల్లవారు జామున తన ఇంటి ముందు ఉన్న షెడ్లో ఉరి వేసుకుని మృతి చెందాడని పోలీసులు తెలిపారు.


మృతుని భార్య లక్ష్మి రిమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఎఎన్ఎంగా విధులు నిర్వహిస్తోంది. ఈయనకు కుమారుడు ముఖేష్, కుమార్తె వందనలు ఉన్నారు. శవపంచనామా జరిపి అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఖాదర్ బాషా తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com