ఈ వేసవిలో పుచ్చకాయలను తరచూ తింటూనే ఉంటాం. పుచ్చకాయను ముక్కలుగా తినటం రొటీనే. అలా కాకుండా, వెరైటీగా ఏదైనా చెయ్యాలనుకునేవారు ఈ రెసిపీ ని ఒకసారి ట్రై చెయ్యండి. ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చెయ్యొచ్చు. అదెలాగో చూద్దామా...
కావలసిన పదార్థాలు: పుచ్చకాయ - సగం, పంచదార - 2 కప్పులు, ఉప్పు- కొద్దిగా, అల్లం - చిన్నముక్క, నిమ్మకాయ - 1.
తయారీవిధానం: ముందుగా పుచ్చకాయ సగం ముక్కను చిన్న ముక్కలుగా, గింజలు లేకుండా కట్ చేసి ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. అందులోనే, 2 కప్పుల పంచదార, రుచికి సరిపడా ఉప్పు, చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం, గింజలు లేని నిమ్మకాయ రసాన్ని వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టుకొని, పిప్పిని వేరు చేయాలి. ఈ జ్యూస్ ను గ్లాసులోకి తీసుకుని అందులో నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకుంటే, రుచికరమైన పుచ్చకాయ జ్యూస్ రెడీ...