ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బూస్టర్ డోసు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Fri, May 13, 2022, 07:57 PM

విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులకు బూస్టర్ డోసు అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో డోసు, బూస్టర్ డోసు మధ్య వ్యవధిని తగ్గించింది. ఈ రెండింటి మధ్య అంతరాన్ని 9 నెలల నుంచి 90 రోజులకు కుదించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోసును అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవడానికి అర్హులని ప్రకటించింది. దీనిపై విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులు, విద్యార్థుల నుంచి ఆరోగ్య శాఖకు పలు అభ్యర్థనలు వచ్చాయి. ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకుని, నిపుణుల సలహా మేరకు ఆ అంతరాన్ని తగ్గించింది. విదేశాలకు వెళ్లేవారు వారు వెళ్లే దేశంలోని రూల్స్ కి తగ్గట్టుగా ప్రికాషనరీ డోసు తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. తాజాగా ఆ వ్యవధిని 3 నెలలకు తగ్గిస్తూ ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com