ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భీకర వానలతో న్యూయార్క్ అస్తవ్యస్తం..

international |  Suryaa Desk  | Published : Fri, Sep 03, 2021, 10:33 AM

అమెరికాలోని న్యూయార్క్ అల్లకల్లోలమైంది. భీకర వానలు.. ఆకస్మిక వరదలు పోటెత్తడంతో.. నగరమంతా జలమయం అయ్యింది. దీంతో ఆ నగర మేయర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇదా తుఫాన్ వల్ల అమెరికాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే చరిత్రలో ఎన్నడూ లేనంతగా న్యూయార్క్‌లో వర్షం కురిసినట్లు మేయర్ బిల్ డీ బ్లాసియో తెలిపారు. రోడ్లపై అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నట్లు ఆయన వెల్లడించారు. అతి క్రూరంగా కురిసిన వాన వల్ల.. సబ్ స్టేషన్లు, ఇండ్లు, రోడ్లు అన్నీ నీటమునిగాయి. సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన ఫూటేజ్ వైరల్ అవుతోంది.


న్యూజెర్సీ అంతటా ఎమర్జెన్సీ ప్రకటించారు. వానల వల్ల ఒకరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. పాసైక్ వద్ద ఓ వ్యక్తి నీటిలో మునిగిపోయాడు. ముల్లికా హిల్ వద్ద ఓ టోర్నాడో సుమారు తొమ్మిది ఇండ్లను నేలమట్టం చేసింది. న్యూజెర్సీలోని కేర్నీలో పోస్టల్ ఆఫీసు బిల్డింగ్ కూలిపోయింది. ఆ సమయంలో దాంట్లో తొమ్మిది మంది ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలిగిస్తున్నారు.


 


న్యూయార్క్‌లో ఉన్న సెంట్రల్ పార్క్‌లో ఒక గంటలోనే 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వెదర్ సర్వీస్ పేర్కొన్నది. నగర ప్రజలు ఎవరూ రోడ్లమీదకు రావద్దు అంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అగ్నిమాపక సిబ్బంది కూడా బిజీగా ఉంది. న్యూయార్క్‌లో సబ్‌వే సర్వీసులను పూర్తిగా మూసివేశారు. న్యూయార్క్‌, న్యూజెర్సీ నుంచి వెళ్లే రైలు, విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com