ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు తప్పక గుడ్డు తినాలి!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 25, 2021, 05:06 PM

శరీరానికి పోషకాలు అందించే ఆహారాల్లో కోడిగడ్లు ముఖ్యమైనవి. గుడ్లలో శరీరానికి కావాల్సిన శాచురేటెడ్ ఫ్యాట్స్‌, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కోడిగుడ్లు తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.


-కోడిగుడ్లలో పొటాషియం, విటమిన్-ఎ, కాల్షియం, ఐరన్, విటమిన్-డి, విటమిన్ బి6, విటమిన్ బి12, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి


- మెదడు ఆరోగ్యానికి గుడ్లు మంచివి. గుడ్డుసొనలో ఉండే కోలిన్ అనే పోషక పదార్థం మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.


-ఇందులో ఉండే ఐరన్ గర్భిణులు, బాలింతలకు మేలు చేస్తుంది.


-నరాల బలహీనత ఉన్న‌వారు కూడా ప్ర‌తిరోజూ క్ర‌మం తప్ప‌కుండా గుడ్డును తీసుకోవడంవ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంది.


-మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది.


-జట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.


- విటమిన్-ఏ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.


-ఎముకల దృఢత్వానికి గుడ్లు తోడ్పడతాయి.


-గుండెకు, రక్తనాళాలకు కూడా కోడిగుడ్డుతో మేలు కలుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com