మంత్రి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై నాని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లె ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని నారావారిపల్లె పంచాయతీ సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి సహా వార్డు మెంబర్లంతా కలిసి చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నారా 420 వైరస్ నారావారి పల్లెలో పుట్టిందని అవమానకరంగా మాట్లాడారని, మంత్రి వ్యాఖ్యలు తమను నొప్పించే విధంగా మాట్లాడిన మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.