ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీలం రంగు అరటిపండ్ల గురించి తెలుసా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 10, 2021, 01:36 PM

మనకు పసుపు కలర్ లో ఉండే అరటిపండ్లు మాత్రమే తెలుసు. కానీ కొన్ని దేశాల్లో నీలం రంగు అరటిపండ్లను కూడా పండిస్తున్నారు. ఈ నీలం రంగు అరటిపండ్లలో ఎన్నో ఔషధ గుణాలుంటాయని చెబుతారు. ముడి అరటి రంగు ఆకుపచ్చగా, పండిన అరటి రంగు పసుపు రంగులో ఉంటుందని మనకు తెలిసిందే. అయితే నీలి అరటి కూడా ఉందని మీకు తెలుసా? ఇవి చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని చెబుతారు.


మీడియా నివేదికల ప్రకారం.. ఈ అరటిపండ్లు తక్కువ ఉష్ణోగ్రతలతో చల్లని ప్రాంతాల్లో పండిస్తారు. ప్రస్తుతం ఆగ్నేయాసియా, దక్షిణ అమెరికాలో ఈ అరటి పండ్లను పండిస్తున్నారు. ఫ్లోరిడా, కాలిఫోర్నియా, టెక్సాస్, లూసియానాలో అత్యధిక దిగుబడి ఉంటుంది. నీలం అరటిని వివిధ దేశాలలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. హవాయిలో దీనిని ఐస్ క్రీమ్ అరటి, ఫిజీలో హవాయిన్ అరటి, ఫిలిప్పీన్స్ లో క్రీ అని పిలుస్తారు. నీలం అరటిని 'బ్లూ జావా అరటి' అని కూడా అంటారు. నీలం అరటిపండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. ఈ అరటి మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఇనుము లోపాన్ని భర్తీ చేస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com