ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రజలకు అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 14, 2021, 08:17 AM

ఏపీలో రానున్న 10 రోజుల్లో అకాల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు, ఉత్తర బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అధిక పీడన ప్రాంతాలు కొనసాగుతున్నాయి. వాటి ప్రభావంతో ఏపీలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బుధవారం నుంచి అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమతో పాటు గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు పడతాయని అంచనా వేశారు. ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతాలకు మాత్రమే వర్షసూచన ఉందని, సముద్రతీర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపారు. జార్ఖండ్, ఒడిశాల మీదుగా ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించి ఉంది. దీంతో పాటు తేమగాలుల ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com