ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెజ్లింగ్ క్రీడాకారుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 06, 2020, 04:40 PM

జాతీయ స్థాయి రెజ్లింగ్ క్రీడాకారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. టిఒఐ కథనం మేరకు.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌ గ్రామంలో భుజంకార్ శ్రీనివాస్ అనే రెజ్లింగ్ క్రీడాకారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బొప్పాపూర్‌ గ్రామానికి చెందిన 24 ఏళ్ల భుజంకార్ శ్రీనివాస్ జాతీయ స్థాయి రెజ్లింగ్ క్రీడాకారుడు. ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో స్థిరపడలేనని మనస్తాపంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని మరణంలో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు బొప్పాపూర్‌ చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com