ట్రెండింగ్
Epaper    English    தமிழ்

21వ శతాబ్దంలో ఆన్లైన్ లో జరిగిన 10 అతి పెద్ద డేటా దొంగతనాలు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 26, 2020, 06:01 PM

ఆన్లైన్ లో అధిక శాతం మంది గడపటం మొదలు పెట్టిన తర్వాత, డేటాకు రక్షణ లేకుండా పోయింది. ప్రధానంగా అనేక కంపెనీలు వినియోగదారుల డేటాకు సరైన రక్షణ కల్పించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో 21వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద డేటా దొంగతనాల వివరాలు ఇప్పుడు చూద్దాం.


ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లమంది Adobe వినియోగదారుల సమాచారం అక్టోబర్ 2013లో హ్యాకర్లు దొంగిలించారు. కస్టమర్లకు సంబంధించిన లాగిన్ వివరాలు, వారి క్రెడిట్ కార్డు నెంబర్లు కూడా దొంగతనం చేయబడ్డాయి. అందరి యూజర్లకు సంబంధించిన యూజర్ నేమ్, హ్యాష్ చెయ్యబడిన పాస్వర్డ్‌లు పబ్లిక్ గా పెట్టబడ్డాయి.


14.5 కోట్లు మంది eBay వినియోగదారుల యొక్క డేటా ప్రమాదంలో పడింది. మే 2014లో జరిగిన ఈ ఎటాక్ ద్వారా eBay యూజర్లకు సంబంధించిన పేర్లు, అడ్రస్‌లు, పుట్టిన తేదీ, ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ వంటి వివరాలు ప్రమాదంలో పడ్డాయి. ఆ సంస్థకు చెందిన ముగ్గురు ఉద్యోగుల అకౌంట్లను హ్యాక్ చేయడం ద్వారా eBay నెట్వర్క్ లోకి ప్రవేశించి దానికి సంబంధించిన డేటాను 229 రోజులపాటు హ్యాకర్లు చూడగలిగారు.


Facebook రంగ ప్రవేశం చేయక ముందు MySpace ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ ఫామ్ గా ఉండేది. ఆ సంస్థకు చెందిన 36 కోట్ల యూజర్ అకౌంట్లు మే 2016లో టార్గెట్ చేయబడ్డాయి. ఆ సంస్థ ఎప్పుడూ కూడా యూజర్ల సెక్యూరిటీ గురించి పెద్దగా పట్టించుకోలేదు. MySpace పేజీలను చాలా సులభంగా హ్యాక్ చేయొచ్చు, అందులో ప్రమాదకరమైన కోడ్ పెట్టొచ్చు. రష్యాకు చెందిన హ్యాకర్ ఆ 36 కోట్ల మంది యూజర్ల డేటాని డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టాడు.


ప్రపంచవ్యాప్తంగా అనేక బ్రాంచీలు కలిగిన హోటల్ మారియట్. అన్ని హోటళ్లలో దిగిన 50 కోట్లకు మంది అతిధుల యొక్క డేటా నవంబర్ 2018లో హ్యాక్ అయింది. అందులో పేర్లు, అడ్రస్, మెయిల్ ఐడి లు, పాస్పోర్ట్ నెంబర్ లు, పుట్టిన తేదీ వంటి వివరాలన్నీ ఉన్నాయి.


ఇంటర్నెట్ చరిత్రలోనే ఇది అతి పెద్ద డేటా తస్కరణగా నిలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మంది Yahoo వినియోగదారుల డేటా అప్పట్లో దొంగిలించబడింది. Yahoo సంస్థకు చెందిన Tumblr, Flickr వంటి అన్ని రకాల అకౌంట్లు ప్రమాదంలో పడ్డాయి.


మెయిల్ బాక్స్ సేవలందిస్తున్న ఈ సంస్థకు చెందిన 23.5 కోట్లమంది యూజర్ల మెయిల్ ఐడిలు, పాస్వర్డ్‌లు డార్క్ వెబ్‌లో అప్పట్లో అమ్మకానికి పెట్టబడ్డాయి. అనేక కంపెనీలు కనీసం ఎన్క్రిప్షన్ వాడడం లేదా అన్న విషయాన్ని ఈ డేటా బ్రీచ్ తేటతెల్లం చేసింది.


16.2 కోట్లమంది యూజర్ల మెయిల్ ఐడిలు, యూజర్నేమ్, పాస్వర్డ్ హ్యాష్‌లు డిసెంబర్ 2018లో తస్కరించబడ్డాయి. డార్క్ వెబ్‌లో ఈ డేటా మొత్తం అమ్మకానికి పెట్టబడింది. అదే సమయంలో MyFitness Pal అనే ఫిట్నెస్ అప్లికేషన్ సమాచారం కూడా దొంగిలించబడింది.


2012లో LinkedIn సంస్థ 65 లక్షల మంది యూజర్ల డేటా ప్రమాదంలో పడిందని ప్రకటించింది. అయితే 2016 వరకు దానికి సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడి కాలేదు. 2016లో ఏకంగా 16.5 కోట్ల మంది LinkedIn యూజర్ల డేటా తస్కరణకి గురైందని వెల్లడైంది.


14.7 కోట్ల మంది ఈ సంస్థకు చెందిన యూజర్ల డేటా ప్రమాదంలో పడింది. ఇది ప్రముఖ క్రెడిట్ రిపోర్టింగ్ సంస్థ. యూజర్ల పేర్లు, అడ్రస్‌లు, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్లు, పుట్టిన తేదీలు, సోషల్ సెక్యూరిటీ నెంబర్ల సమాచారాన్ని హ్యాకర్లు చేజిక్కించుకున్నారు.


8.7 కోట్ల Facebook వినియోగదారుల డేటా కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ ద్వారా ప్రమాదంలో పడింది. వినియోగదారుల యొక్క ఆమోదం తీసుకోకుండానే వారి డేటాని ఆ సంస్థ సేకరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com