ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ కు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలివే...

national |  Suryaa Desk  | Published : Sat, Jun 06, 2020, 11:44 AM

కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్రం భారీ సడలింపులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం నుండి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచేందుకు అనుమతించిన కేంద్ర హోంశాఖ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.


హోటళ్లు, రెస్టారెంట్ల మార్గదర్శకాలు:


1. అన్నిచోట్లా సామాజికదూరం పాటించాలి. కనీసం 6 అడుగుల దూరం ఉండాలి.


2. ఫేస్ మాస్క్‌లు, ఫేస్ కవర్లు వినియోగం తప్పనిసరి.


3. తరచుగా సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాలి (కనీసం 20-40 సెకన్ల వరకు). 4. ఎవరైనా దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు టిష్యూలు, చేతి రుమాళ్లు అడ్డుపెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని సూచించిన చోట మాత్రమే పడేయాలి.


5. ఎవరికి వారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా అనారోగ్యం ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలి.


6. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం కచ్చితంగా నిషేధం


7. ఆరోగ్య సేతు యాప్ వినియోగించేలా అందరినీ ప్రోత్సహించాలి.


షాపింగ్ మాల్స్ మార్గదర్శకాలు:


మాల్ కు వచ్చిన తర్వాత ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే, ఆ రోగి గత 48 గంటలు తిరిగిన ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. షాపింగ్ మాల్ మొత్తం మూసేయాల్సిన అవసరం లేదు. మొత్తం శుభ్రం చేసిన తర్వాత మళ్లీ ప్రారంభించవచ్చు. ఒకవేళ భారీ ఎత్తున కోవిడ్ 19 కేసులు నమోదైతే అప్పుడు పూర్తిగా శుభ్రం చేసి.. ఆ తర్వాత దుకాణాలు మూసేయాలి. ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారించుకున్న తర్వాత మళ్లీ తెరవాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు..


1. ఎంట్రన్స్‌లో తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్ ఉండాలి.


2. కరోనా లక్షణాలు లేని కస్టమర్లను మాత్రమే అనుమతించాలి.


3. వర్కర్లు, కస్టమర్లు, విజిటర్లు అందరినీ మాస్క్ లేదా ఫేస్ కవర్ ఉంటేనే అనుమతించాలి. షాపింగ్ మాల్‌లో ఉన్నంత సేపు వారు మాస్క్, ఫేస్ కవర్ ధరించేలా చూడాలి.


4. కోవిడ్ 19 రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోస్టర్లు, స్టాండ్లు, ఆడియో విజువల్ మీడియం ద్వారా ప్రదర్శించాలి.


5. మాల్‌‌కు వచ్చిన కస్టమర్లు సామాజిక దూరం పాటించేలా చూడడానికి సరిపడినంత మంది వర్కర్లను వినియోగించాలి.


6. హైరిస్క్ ఉన్న ఉద్యోగులు, వయసు ఎక్కువ ఉన్న ఉద్యోగులు, గర్భిణులు, వైద్య చికిత్స తీసుకుంటున్న వారు మరింత ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. ఫ్రంట్ లైన్ వర్కర్లకు దూరంగా ఉండాలి. వీలుంటే వారికి వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలి.


7. షాపింగ్ మాల్ బయట, లోపల పార్కింగ్ మేనేజ్‌మెంట్ చేయాలి.


8. షాపింగ్ మాల్‌లో ఉండే దుకాణాలు, స్టాల్స్, క్యాంటీన్లలో తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి.


9. కస్టమర్లు లోనికి వెళ్లడానికి ఓ మార్గం, బయటకు వెళ్లడానికి మరో మార్గం ఉండేలా చూడాలి.


10. లిఫ్ట్‌లో తక్కువ మంది వెళ్లేలా నిబంధనలు విధించాలి.


11. ఎస్కలేటర్లపై ఒక మెట్టు మీద ఒకరే ఉండేలా చూడాలి.


12. షాపింగ్ మాల్స్‌లో పెద్దన ఎత్తున కార్యక్రమాలు నిర్వహించకూడదు. ఇక పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఇళ్లలోనే ఉంటే మంచిదని కేంద్రం స్పష్టం చేసింది.


కరోనా ప్రస్తుతం తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించకుండా బయటకు రావొద్దని, కనీస సామాజిక దూరం విధిగా పాటించాలని కేంద్రం సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com