ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీకి పిలిచి స్నేహితురాలిని చంపేశాడు

national |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 02:01 PM

న్యూఢిల్లీ: తన పుట్టినరోజు వేడుకకు పిలిచి స్నేహితురాలిని చంపేశాడు ఓ వ్యక్తి. ఈ విషాద సంఘటన దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో గడిచిన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మృతురాలిని ఢిల్లీలోని కేరా కలాన్‌ ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల మహిళగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టినరోజు వేడుకను జరుపుకునేందుకు నిందితుడు, సదరు మహిళ ఇరువురు కలిసి ఓయో హోటల్‌ రూంలోకి వెళ్లారు. గదిలో ఇరువురు మద్యం సేవిస్తుండగా ఏదో చిన్న విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో సదరు వ్యక్తి మహిళ గొంతుపై బలంగా కొట్టడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆ స్థితిలో ఆమెను చూసిన వ్యక్తి అక్కడినుంచి పారిపోయాడు. మంగళవారం ఉదయం హోటల్‌ సిబ్బంది చూసి పోలీసులకు ఫోన్‌ చేశారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com