ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇసుక దోపిడీలో ఊహలకు అందని మాస్టర్ స్కెచ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 06:12 PM

అందరూ దసరా పండుగ హడావుడిలో ఉంటే టీడీపీ నేతలు మాత్రం టెండర్ల పండుగలో ఉన్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్‌బాబు అన్నారు. రెండు రోజుల్లోనే టెండర్లు పిలవటం ఏంటి?. ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఎల్లోమీడియాలో వార్తలు ఎందుకు రావటం లేద‌ని ప్ర‌శ్నించారు.


ఊహలకు అందని మాస్టర్ స్కెచ్‌తో ఇసుకను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన అనుభవాన్నంతా రంగరించి దోపిడీకి ప్లాన్ వేశారని అన్నారు. వైయ‌స్‌ జగన్ ప్రభుత్వంలో ఇసుక పంపిణీలో లోపాలు జరిగినట్టు ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలు గుర్తించాలని  అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com