ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొట్ట చుట్టూ కొవ్వు ఐస్ లా కరగాలంటే..ఈ ఆరు కూరగాయాలను ప్రతి రోజూ డైట్‌లో

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 12:48 PM

కొవ్వు కరిగించడం.. ప్రస్తుతం యువత ముందు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్. ఎక్కువ సేపు కూర్చునే ఉండే ఉద్యోగాల వల్లో.. తన శరీరాకృతిపై శ్రద్ద పెట్టకనో తెలియదు కానీ యువతలో కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నాయి.ఆ కొవ్వును కరిగించడానికి యువత ఆపసోపాలు పడుతోంది. పూటలు.. రోజులు.. వారాలు ఆహారం మానేసి.. మరీ శ్రమిస్తుంది. కానీ కూరగాయాల్లో కొన్ని కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయని తెలుసా. రాయిలాంటి కొవ్వును కూడా వెన్నలా కరిగించే శక్తి ఉన్న ఆరు కూరగాయలు ఏంటో తెలుసా.. అవే పాలకూర, క్యారెట్స్, వింటర్ పుచ్చకాయ, క్యాలీఫ్లవర్, చేదు పుచ్చకాయలు, కీరాదోసకాయ. వీటిని కొవ్వు కరిగించడానికి ది బెస్ట్ అని ఎందుకు చెప్తారో కూడా చూద్దాం.. నిపుణులు సైతం.. ఈ ఆరు కూరగాయాలను ప్రతి రోజూ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కొవ్వు కరిగడాన్ని వేగవంతం చేయొచ్చని, ఒకవేళ కొవ్వు లేని వారు తింటే అనవసర కొవ్వు పేరుకోకుండా అడ్డుకుంటాయని చెప్తున్నారు.


పాలకూర: ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అదే విధంగా ఫైబర్ స్థాయి అధికంగా ఉండటం వల్ల ఎక్కువ సేపు ఆకలి కాకుండా కూడా ఉంటుంది. వీటితో పాటుగా 158 గ్రాముల వండిన పాలకూరలో 37శాతం మెగ్నీషియమ్ ఉంటుంది. ఇది మన బ్లడ్ షుగర్‌ స్థాయిలను రెగ్యులేట్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది కూడా బరువును మేనేజ్ చేయడంలో దోహదపడుతుంది. అప్పుడు డైట్‌ చేసిన విధంగానే మన కొవ్వును కరిగించి శరీరం తనకు కావాల్సిన క్యాలరీలను సంపాదించుకుంటుంది. దాంతో కొవ్వు కరిగే ప్రక్రియ అధికమవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు పాలకూరను.. సలాడ్స్, స్మూతీలతో కలుపుకుని కూడా తీసుకోవచ్చు.


వింటర్ మెలన్: సాధారణంగా వేసవిలో పుచ్చకాయలు దొరుకుతుంటాయి. అదే విధంగా చలికాలంలో లభించే పుచ్చకాయలను వింటర్ మెలన్స్ అంటారు. వీటిలో క్యాలరీలు అత్యల్పంగా ఉండి.. నీటి శాతం, ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే వీటిని తినడం ద్వారా మన తీసుకునే క్యాలరీలు తగ్గి.. బరువు తగ్గడంలో దోహదపడతాయి.


కాలీఫ్లవర్: వీటి విషయంలో కూడా అదే విధంగా పనిచేస్తుంది. దీంతో పాటుగా కాలీఫ్లవర్ తినడం ద్వారా హార్మోన్స్‌ను రెగ్యులేట్ చేస్తుంది. దాంతో పాటు నడుము చుట్టూ చేరే కొవ్వును కూడా మేనేజ్ చేస్తుంది. పర్ఫెక్ట్ షేప్ మెయింటెన్ చేయాలనుకునే వారికి కాలీఫ్లవర్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వీటిని ఉడకపెట్టి తినడాన్ని ఎక్కువ మంది నిపుణులు ప్రిఫర్ చేస్తారు.


క్యారెట్స్: నడుము చుట్టూ ఉండే కొవ్వును తగ్గించి.. పర్ఫెక్స్ నడుమును తీసుకురావడంతో క్యారెట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో క్యాలరీస్ తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉండటమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉండి షేప్ మెయింటనెన్స్‌కు ఉపయోగపడతాయి. దీంతో పాటుగా ఇందులో కొవ్వును తగ్గించడంలో ప్రధానంగా ఉపయోగపడే విటమిన్ ఏ, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఇందులో ఉండే విటమిన్ సీ మన స్కిన్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.


కాకరకాయ: ఇవి చాలా చేదుగా ఉంటాయి. అందుకే వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఎక్కువగా వీటిని వేపుడుగానే తినడానికి ఎక్కువ మంది ఇష్టత చూపుతారు. కానీ ఇవి చేసే మేలు తెలిస్తే కష్టమైనా వదిలి పెట్టకుండా పచ్చిగా తినడానికి ప్రయత్నిస్తారు. ఇవి అన్నింటిలాగే క్యాలరీలను అత్యల్పంగా కలిగి ఉంటాయి. దాంతో పాటుగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన బాడీని మెయింటెన్ చేయడంలో ప్రధానంగా మారడమే కాకుండా.. వీటిలో ఉండే కటలేస్ అనే ఎంజైమ్‌లు మద్యపానం వల్ల డ్యామెజ్ అయిన కాలేయాన్ని రిపేర్ కూడా చేస్తుంది. దాంతో పాటుగా మన లివర్ ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు లివర్ పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.


 


కీరా: వీటిలో ఉండే తక్కువ క్యాలరీలు, అధికంగా ఉండే నీటి శాతం, విటమిన్లు, మినరల్స్ అన్నీ కూడా మన బాడీ వెయిట్‌ను తగ్గించడంలో(Reduce Fat) ఉపయోగపడతాయి.


 


నీటి శాతం అధికంగా ఉండే ఈ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా మన శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. డీటాక్సిఫికేషన్ మన చర్మం తన సాగే గుణాన్ని పెంచుకుంటుంది. అంతేకాకుండా చర్మంలో గ్లో కూడా వస్తుంది. వీటిని పచ్చివిగా తినొచ్చు. సలాడ్స్, జ్యూస్‌లు, సూప్స్‌లో కలుపుకుని కూడా తినొచ్చు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com