తాడిపత్రి పట్టణ సమీపంలోని అనంతపురం ఫ్లైఓవర్ సమీపంలో గల పాతబడ్డ బండల ఫ్యాక్టరీ వద్ద గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని శుక్రవారం రూరల్ సీఐ లక్ష్మికాంతరెడ్డి తెలిపారు. మృతుడు టీషర్ట్, ప్యాంట్ ధరించాడని, వయస్సు 45 నుంచి 50సంవత్సరాలలోపు ఉంటుందని తెలిపారు. ఐదురోజుల క్రితం ఉరి వేసుకొని ఉండవచ్చునని సీఐ తెలిపారు.