ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలిసారి టైటిల్ విజేతగా నిలిచిన ఖతార్

international |  Suryaa Desk  | Published : Sat, Feb 02, 2019, 10:45 AM

అద్భుతమైన ఆటతీరుతో తొలిసారి ఫైనల్‌ చేరిన ఖతార్‌ జట్టు ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో తమకంటే మెరుగైన జట్టు, నాలుగు సార్లు చాంపియన్‌ అయిన జపాన్‌కు షాకిచ్చింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో ఖతర్‌ 3-1తో జపాన్‌ను ఓడించింది.మ్యాచ్‌ 12వ నిమిషంలో అల్మొయిజ్‌ అలీ కళ్లుచెదిరే బైస్కిల్‌ కిక్‌తో ఖతర్‌కు తొలి గోల్‌ అందించాడు. ఆ తర్వాత అబ్దుల్‌ అజీజ్‌ హటెమ్‌ 27వ నిమిషంలో మరో గోల్‌ సాధించడంతో ఖతార్ 2-0 ఆధిక్యాన్ని సాధించింది. ఇక, రెండో అర్ధభాగంలో జపాన్‌కు ఏకైక గోల్‌ను 69వ నిమిషంలో మినా మినో అందించాడు.


అయితే, చివర్లో అక్రమ్‌ అఫిఫ్‌ 83వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి ఖతార్‌ను తిరుగులేని స్థితిలో నిలిపాడు. దీంతో తొలిసారి పైనల్లోకి చేరిన ఖతార్ జట్టు ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ టైటిల్‌ విజేతగా అవతరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com