వైసీపీ అధికారంలో ఉండగా విజయవాడలో నిర్మాణం చేపట్టిన అంబేద్కర్ విగ్రహం నామాఫలకాలను ధ్వంసం చేయడంపై మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు, జరిగిన ఘటనను నిరసనగా శనివారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కాశీబుగ్గలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి బైఠాయించారు. విగ్రహం వద్ద ధ్వంసానికి పాల్పడడం నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించడం అత్యంత బాధాకరమన్నారు.